భర్త, పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో సహజీవనం..పెళ్లి చేసుకోమనేసరికి దారుణం

by Anukaran |   ( Updated:2021-08-24 11:21:24.0  )
illegal-affair
X

దిశ, ఏపీ బ్యూరో: వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ మహిళ పరాయిపురుషుడి మోజులోపడింది. అతడి వ్యామోహంలో పడి తాళికట్టిన భర్తను..కన్నబిడ్డలను కాదనుకుంది. అతడితో సహజీవనం చేస్తోంది. చివరికి ఆ ప్రియుడు చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడపలో యశోద (29) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది.

అక్రమ సంబంధంమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. యశోదకు పదేళ్లక్రితం జయశంకర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా. అయితే సురేశ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడటంతో భర్తను..ఇద్దరు పిల్లలను వదిలేసి అతడితో సహజీవనం చేస్తోంది. అయితే పెళ్లి చేసుకోవాలంటూ యశోద సురేశ్‌పై ఒత్తిడి తీసుకురావడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన సురేశ్ యశోదను ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా సురేశ్ హత్య చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story