- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూలైలో పెరిగిన వాహన అమ్మకాలు..
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఆటో పరిశ్రమలో ప్రస్తుత ఏడాది జూలై నెలకు సంబంధించి అమ్మకాలు పెరిగాయి. హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు సెమీ కండక్తర్ల సరఫరాలో ఆటంకాలను అధిగమించి అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి 50 శాతం వృద్ధితో మొత్తం 1.62 లక్షల వాహనాలను విక్రయించింది. మరో దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 19 శాతం పెరిగి 52 వేల వాహనాలను విక్రయించింది.
హోండా మోటార్స్ ఇండియా 12 ఏళ్ల రికార్డును అధిగమిస్తూ 12 శాతం పెరిగి మొత్తం 6,055 వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. హ్యూండాయ్ మోటార్ ఇండియా జులై 48,042 వాహనాలను అమ్మి 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక, టయోటా కిర్లోస్కర్ గతేడాదితో పోలిస్తే ఏకంగా 143 శాతం వృద్ధితో మొత్తం 13,105 వాహనాలను విక్రయించింది. స్కోడా మొత్తం 3,080 కార్లను అమ్మి మూడు రెట్ల వృద్ధిని సాధించింది. ఎంజీ మోటార్ ఇండియా 100 శాతం వృద్ధితో మొత్తం 4,225 యూనిట్ల వాహనాలను విక్రయించింది.
ద్విచక్ర వాహన విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాల అమ్మకాలు 9 శాతం పెరిగి 44,038 యూనిట్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి ఆర్థికవ్యవస్థ కోలుకుంటూ ఉండటం, వ్యక్తిగత మొబిలిటీ వైపుగా వినియోగదారులు మారుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగం సానుకూల వృద్ధి స్పష్టంగా ఉందని’ హ్యూండాయ్ మోటార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్, సర్వీసెస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ అన్నారు.