ఏపీలో మరో పథకం.. మహిళలకు రూ. 75 వేలు

by Anukaran |
ఏపీలో మరో పథకం.. మహిళలకు రూ. 75 వేలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం మరో పథకాన్ని ప్రారంభించింది. తాడేపల్లి సీఎం ఆఫీసులో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 28 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనున్నదని పేర్కొన్నారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. రూ. 18,750 ల చొప్పులన మొత్తం వారి ఖాతాలో వచ్చే 4 ఏళ్లలో రూ. 75 వేలు జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ పథకం కోసం రూ. 4 వేల 700 కోట్లు కేటాయించినట్లు జగన్ వివరించారు.

సొంత కాళ్ల మీద నిలబడాలనుకునేవారికి ప్రభుత్వం చేయూతనిస్తామని, ఈ పథకం కింద మంజూరైన ఆర్థిక సహాయాన్ని పెట్టుబడిగా మార్చుకుని స్వయం ఉపాధి పొందాలని జగన్ భరోసా ఇచ్చారు. అమూల్ వంటి కొన్ని బడా సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రభుత్వం సహకరించనున్నట్లు జగన్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed