- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ముషీరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కవాడిగూడ ఇందిరాపార్క్‌లో 19.5 లక్షలతో నూతనంగా, ఆక్యుప్రెజర్ పద్ధతిలో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఇందిరా పార్కులో పంచ తత్వ పార్కును ప్రారంభించామని తెలిపారు. ఎకరం స్థల విస్తీర్ణంలో ఎనిమిది విభాగాలుగా ఆక్యూప్రెజర్ పద్ధతిలో నడిచేప్పుడు పాదాలపైన, నరాలపైన ఒత్తిడి కలిగేలా వాక్ ట్రాక్ ఏర్పాటు చేశారన్నారు.
రూ.4 కోట్లతో పార్కులో మరిన్నీ అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ఇందిరా పార్కు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంతేగాకుండా సోమవారం నగర వ్యాప్తంగా మరో పదహారు పంచ తత్వ పార్కులను ప్రారంభించనున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ ప్రారంభంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.