ప్రపంచలోనే అతి చిన్న జైలు.. ఎంత మంది నేరస్తులో తెలుసా..?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-12-04 11:10:51.0  )
ప్రపంచలోనే అతి చిన్న జైలు.. ఎంత మంది నేరస్తులో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: జైలు అనే పేరు వినగానే పెద్ద పెద్ద గోడలు, చిన్న తలుపులు, అందులో వేల సంఖ్యలో ఖైదీలు గుర్తుకొస్తారు. కానీ, ఈ జైలు మాత్రం చాలా స్పెషల్‌గా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జైలు గురించి వినే ఉంటారు. కానీ, అతి చిన్న జైలు కూడా ఉందని తెలుసా. ప్రపంచంలోనే అతి చిన్న జైలును 168 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో ఈ దీవిలో కేవలం 600 మంది మాత్రమే ఉండేవారని గణాంకాలు చెబుతున్నాయి. అసలు ఈ జైలు ఎక్కడ ఉంది? ఇందులో ఎంత మంది ఖైదీలు ఉంటారో ఇక్కడ చదివేయండి.

అతి చిన్న జైలు:

ప్రపంచంలోనే అతి చిన్న జైలు సార్క్ ద్వీపంలో ఉన్న సార్క్ జైలు. దీనిని 1856లో నిర్మించారు. ఇందులో కేవలం ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉంటారు. ఇందులో కేవంలం రెండు గదులు మాత్రమే ఉంటాయి. ఈ సెల్ లోపల నీటి కుళాయి, కరెంట్ కూడా ఉంది. అయితే, మొదట్లో ఈ జైలులో విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదట. దాదాపుగా శతాబ్దం తరువాత దీనికి విద్యుత్ సౌకర్యంను కల్పించారు. ఈ సార్క్ ద్వీపం మొత్తం 5.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.

అయితే, ఈ జైలును నిర్మించేందుకు డబ్బులు లేకపోవడంతో దీనిని ఏర్పాటు చేయడానికి 20 ఏళ్లు పట్టింది. ప్రస్తుత కాలంలో ఈ జైలులో నేరస్తులను ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడితే వారిని ఈ జైలులో రెండు లేదా మూడు రోజుల పాటు ఉంచుతారు. తరువాత వారిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరో పెద్ద జైలుకి తరలిస్తారు. ఈ దీవిలో కేవలం ఇద్దరు పోలీసులు మాత్రమే ఉంటారు.

Advertisement

Next Story