కేజ్రీవాల్ vs లెఫ్టినెంట్ గవర్నర్.. ఈసారి విద్యుత్ సబ్సిడీపై వివాదం

by GSrikanth |
కేజ్రీవాల్ vs లెఫ్టినెంట్ గవర్నర్.. ఈసారి విద్యుత్ సబ్సిడీపై వివాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)ల మధ్య మరో వివాదం తలెత్తింది. ఇప్పటికే అనేక అంశాలపై ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతుండగా ఈసారి విద్యుత్ సబ్సిడీపై వార్ మొదలైంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సబ్సిడీ నేటితో ముగియనుండగా దీనికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంతో నేటి నుంచి సబ్సిడీ నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ మంత్రి అతిషి శుక్రవారం స్పష్టం చేశారు. రేపటి నుంచి సబ్సిడీ లేకుండా బిల్లులు జారీ అవుతాయని ఆమె వెల్లడించారు. వచ్చే ఏడాది పాటు సబ్సిడీ పొడిగించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి సంబంధించిన ఫైల్‌ను ఎల్జీ ఆమోదించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

కాగా.. కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ఎల్జీ వీకే సక్సేనా సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అతిషి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి ఖండించారు. అనవసర రాజకీయాలు మానుకోవాలని ఏప్రిల్ 4 వరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎందుకు పెండింగ్‌లో ఉంచారు. ఏప్రిల్ 15 వరకు గడువు ముగియనుండగా ఏప్రిల్ 11న మాత్రమే ఫైల్ ఎందుకు పంపించారని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో ప్రశ్నించింది. దీంతో ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మధ్య తాజా వివాదం హాట్ టాపిక్ అవుతోంది. సబ్సిడీ ఎత్తివేడయంతో 46 లక్షల కుటుంబాలపై విద్యుత్ భారం పడనున్నట్లు సమాచారం. కాగా, ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల నెలవారీ వినియోగంతో వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తోంది.. 201 నుండి 400 యూనిట్లు వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ ప్రయోజనం కల్పిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed