అధికార వైసీపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఘన విజయం

by Shiva |
అధికార వైసీపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఘన విజయం
X

వైసీపీ కొంపముంచిన క్రాస్ ఓటింగ్..

దిశ వెబ్ డెస్క్: ఏపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో అనూహ్య ఫలితం నమోదైంది. ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ నమోదైంది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాల్సి ఉండగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లతో ఘన విజయం సాధించింది. దీంతో అధికార వైసీపీలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం బట్టబయలైంది. అయితే, వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌చార్జులుగా తొలగించి వేరే వారిని కూడా నియమించింది.

ముఖ్యంగా కోటంరెడ్డిని కొద్ది రోజుల కింద నిండు సభలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నానా బూతులు తిట్టారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. వీరిద్దరూ అంతరాత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అదే జరిగితే వైసీపీ బలం 155 నుంచి 153కి పడిపోయింది. టీడీపీ అభ్యర్థికి అధికారికంగా 19 ఓట్లు ఉండగా ఆనం, కోటంరెడ్డి ఓట్లతో టీడీపీ బలం 21కి పెరిగింది. కానీ, కౌంటింగ్ పూర్తయిన నేపథ్యంలో అనురాధకు 23 ఓట్లతో విజయం సాధించడంతో మరో రెండు ఓట్లు అధికార పార్టీ నుంచి టీడీపీ అభ్యర్థికి ఎవరు వేశారనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed