- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిరుచ్చి విమానాశ్రయంలో 47 కొండచిలువలు స్వాధీనం
by Shiva |

X
దిశ, వెబ్ డెస్క్ : తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు కౌలాలంపూర్ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లో 47 పాములు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడు మహమ్మద్ మొయిదీన్ ను అదుపులోకి తీసుకున్నారు. బాటిక్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడు మొయిదీన్‌ను అడ్డుకున్నారు.
అతడి బ్యాగ్‌ల తనిఖీ చేయగా వివిధ పరిమాణాల్లో ఉన్న కొండచిలువలను రంధ్రాలు పెట్టిన పెట్టెల్లో ఉన్నాయి. అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సరీసృపాలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విచారణ నిమిత్తం మొయిదీన్‌ను కస్టమ్స్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story