- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా జీవించాలంటే ఇలా చేయాలి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దిశ, దేవరకొండ: ‘మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం.. సీజనల్ వ్యాధులను నివారిద్దాం’ అని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పరిసరాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లి, డ్రైనేజీ కాలువను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటితో పాటుగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మానవుల ఆరోగ్యవంతమైన జీవనానికి పచ్చదనం, పరిశుభ్రత అత్యంత ప్రాముఖ్యమైనవని, పరిశుభ్రతతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఆయన తెలిపారు. పరిశుభ్రంగా ఉంటే సీజన్ లలో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చు అని ఆయన సూచించారు. అంతకముందు చందంపేట మండలం దేవరచర్ల గ్రామానికి చెందిన పాండుకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును అందజేశారు. ఆయన వెంట వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, ఇలియస్ పటేల్, కేతావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.