ఏపీలో మరో అద్భుతం ఆవిష్కృతం : జగన్

by Anukaran |
acm jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో మరికాసేపట్లో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో సీఎం వైఎస్ జగన్ పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలో మోడల్ హౌస్‌ను పరిశీలించారు.పేదలందరికీ ఇళ్ల పేరుతో పైలాన్ ను ఆవిష్కరించారు. కొద్దిసేపట్లో ఇళ్లపట్టాలను జగన్ పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మందికిపైగా ఇళ్లపట్టాల పంపిణీ జరగనుంది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. క్రిస్మస్, ఏకాదశి పండుగ ఇవాళే రావడం శుభపరిణామమని అన్నారు. రెండు దశల్లో 28లక్షలకు పైగా ఉచిత పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతామని హామీనిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 15రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 30లక్షల మంది మహిళల చిరునవ్వును చూస్తున్నామని చెప్పారు. సుమారు రూ.50వేల కోట్లతో నిర్మాణం జరుగుతుందని, వచ్చే మూడెళ్లలో పూర్తిచేసి లబ్దిదారులకు అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

Next Story

Most Viewed