- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంటర్ ఫెయిల్ అయ్యాడని ఆ విద్యార్థి ఏం చేశాడో తెలుసా

దిశ, ఘట్కేసర్ : ఇంటర్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధి అన్నోజి గూడ నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి జశ్వంత్ (17) పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే జగిత్యాల హనుమాన్ వాడకు చెందిన జశ్వంత్ అన్నోజి గూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని, రెండో సంవత్సరంలోకి చేరాడు. మొదటి సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ మందలించడంతో మనస్థాపం చెంది గురువారం ఉదయం నారాయణ జూనియర్ కళాశాలలో పురుగుల మందు సేవించినట్లు సమాచారం. పురుగుల మందు సేవించిన విద్యార్థిని గమనించిన కళాశాల సిబ్బంది హుటాహుటిన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జశ్వంత్ మృతి చెందినట్లు తెలుస్తోంది. కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.