- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగు అకాడమిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో తెలుగు అకాడమి పరిస్థితిపై ఆ సంస్థ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అకాడమి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అకాడమిని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆశ ఉన్నప్పటికీ… పరిస్థితులు అందుకు సహకరించడం లేదని చెప్పుకొచ్చారు.గత ప్రభుత్వం తెలుగు అకాడమిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
తెలుగు అకాడమి ద్వారా ఇంటర్మీడియట్ పుస్తకాల ముద్రణకు ప్రభుత్వం అనుమతించిందని… వారం రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాలను ఆవిష్కరింపజేస్తామని లక్ష్మీపార్వతి వెల్లడించారు. నాడు-నేడు పథకం ద్వారా విద్యారంగానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం హయాంలో తెలుగు అనే పేరు లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారని ధ్వజమెత్తారు. తెలుగు అకాడమిలో సంస్కృతాన్ని చేర్చడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవన్నారు. తెలుగు భాషకు సంస్కృత భాష ఒక ఉపలబ్ధి మాత్రమేనని చెప్పుకొచ్చారు. తెలుగు భాషను సంస్కృతం దెబ్బతీయలేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.