మా సమస్యను పట్టించుకునే నాథుడే లేడా..??

by Sridhar Babu |   ( Updated:2021-12-14 01:59:00.0  )
మా సమస్యను పట్టించుకునే నాథుడే లేడా..??
X

దిశ, చింతకాని: చింతకాని రెవిన్యూ పరిధిలోని చిన్న మండవం గ్రామం నుంచి ప్రభుత్వ అనుమతులతో గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జారీ చేసిన కూపన్ ల సంఖ్య 8078. 2BHK, వైకుంఠదామం, రైతు వేదికలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్ ల కోసం జారీ చేసిన ఉచిత పర్మిట్ల సంఖ్య 2240. ఇప్పటి వరకు మొత్తం 10,318 ఇసుక కూపన్ ల ద్వారా రూ.1061 చొప్పున ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన సొమ్ము రూ.85,70,758.

ఇందులో భాగంగా ఇసుక కూపన్ ద్వారా లేబర్ కూలీలకు వచ్చే డబ్బును డీడీ నెంబర్ 038906 తో ఎమ్మార్వో, పంచాయితీ సెక్రటరీ కి రూ.64,50,000 ఇచ్చారని సమాచారం. అయితే గత రెండు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకుండా అధికారులు ఆఫీసుల చుట్టు తిప్పించుకుంటున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ చార్జీలు తమకు వెంటనే కల్పించి ఆదుకోవాలని వారు మొర పెట్టుకున్నారు. గత రెండేళ్ల నుంచి అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని లేబర్ కూలీలు వేడుకున్నారు.

Advertisement

Next Story