ఎమ్మెల్సీలుగా కూచుకుల్ల, కసిరెడ్డి ఏకగ్రీవం

by Shyam |
MLC
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు శుక్రవారం ప్రకటించారు. మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రెండు స్థానాలకు అధికార పార్టీ అభ్యర్థుల ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

MLC unanimous

నిబంధనల ప్రకారం ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఫలితాలను ప్రకటించవలసి ఉండడంతో శుక్రవారం సాయంత్రం మూడు గంటలు తర్వాత ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డితో కలిసి వెళ్లి ధ్రువీకరణ పత్రాలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు.

Advertisement

Next Story