- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ వరంగల్‌కు మహర్దశ..
దిశ, న్యూస్ బ్యూరో
వరంగల్ మహా నగరానికి మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న ఓరుగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ లోని పెండింగ్ పనులు, భవిష్యత్ ప్రణాళికలపై బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్‌లు సమీక్షించారు. ఇందులో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) మాస్టర్ ప్లాన్‌కు కేటీఆర్ ఆమోదం తెలిపారు. 2020 నుంచి 2041 వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్‌తో వరంగల్ మహానగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్ చేరుతుందని మంత్రి వెల్లడించారు. కుడా మాస్టర్ ప్లాన్‌ను ఆమోదంతో ఉమ్మడి జిల్లా మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్‌కు మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో 29కిలోమీటర్ల పనులను మే నెల చివరి నాటికి పూర్తి చేసి, రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో 15కిలోమీటర్ల మేర మోనో రైలు ప్రతిపాదనలతో పాటు హైదరాబాద్ తరహాలో మెట్రో రైల్ ప్రతిపాదనలు కూడా డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. మామునూర్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్టు మంత్రి తెలిపారు.
స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా వెంటనే నగరంలో 1000 పబ్లిక్ టాయిలెట్లను దసరాలోపు నిర్మించాలన్నారు. మొదటగా ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలన్నారు.
2,200డబుల్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతోందని, కేవలం 800ఇండ్ల నిర్మాణం కొన్ని స్థానిక ఇబ్బందుల వల్ల ప్రారంభం కాలేదని, మంత్రి కేటిఆర్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకురావడంతో అక్కడ ఇండ్లు ప్రారంభించలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. దసరా నాటికి 3900 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం బడ్జెట్‌లో కూడా డబుల్ ఇండ్ల నిర్మాణానికి నిధుల లోటు లేనందున, వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తి చేసేందుకు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలన్నారు. కాళోజి కళాక్షేత్రం, ఏకశిలా పార్క్ నిర్మాణం, జంక్లన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ ప్లాన్, గ్రీనరీ ప్లాన్ , ఎనర్జీ ఆడిట్ పూర్తి చేసి తీసుకురావాలన్నారు. ఎనర్జీ ఆడిట్‌లో భాగంగా నగరంలో తుప్పు పట్టిన, వంగిన స్తంభాలు, వేలాడే వైర్లు, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే తీసేసి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. నగరానికి మాస్టర్ ప్లాన్ మేరకు శానిటేషన్ ప్రణాళికలు సిద్ధం చేసి తీసుకురావాలన్నారు. బడ్జెట్ లో 10 శాతం పచ్చదనం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో గ్రీనరీ ప్లాన్ రెడీ చేయాలన్నారు. ఉన్న స్మశాన వాటికలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం, కొత్త వాటికోసం స్థలాలు గుర్తించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. నగరానికి నాలుగు వైపుల డంపింగ్ యార్డులు గుర్తించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డులో అతి త్వరలో బయో మైనింగ్ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 16వ తేదీన మరోసారి సమావేశమై ముఖ్యమైన అంశాల మీద చర్చిస్తామని, అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలన్నారు. సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి, మండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిడబ్ల్యు ఎంసి మేయర్ గుండా ప్రకాశ్ రావు, డిఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, కుడా చీఫ్ ప్లానర్ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
Tags: greater warangal, ministers ktr, errabelli, satyavathi, kuda, parks etc