- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాగ్రత్త.. ఈ లక్షణాలుంటే ఆ లోపం ఉన్నట్లే!

దిశ, వెబ్ డెస్క్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఎంతో అవసరం. ఇక శరీరంలో ఏవైనా పోషకాలు లోపిస్తే వెంటనే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు తరచూ సూచిస్తుంటారు. కొన్ని సార్లు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉన్నప్పటికీ విటమిన్లు, ఖనిజాలు, పోషకాల లోపం ఏర్పడవచ్చు. అలాంటి వాటిలో విటమిన్ E లోపం కూడా ఒకటి. అయితే, శరీరంలో విటమిన్ E లోపిస్తే కనిపించే లక్షణాలేంటో తెలుకుందాం.
విటవిన్ E శరీరాన్ని ఆరోగ్య ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడుతుంది. కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. అంతేకాదు, జీవక్రియను బలోపేతం చేయడానికి విటమిన్ ఇ చాలా అవసరం. అలాగే, చర్మం, జుట్టు, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. విటమిన్ E లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.
విటమిన్-ఇ లోపం సంకేతాలివే
విటమిన్ E లోపిస్తే కంటి సమస్యలు, చర్మ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కండరాల బలహీనత, నొప్పికి కారణమవుతుంది. ఈ విటమిన్ నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అందువల్ల, దాని లోపం కండరాల సమన్వయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. విటమిన్ E లోపం వల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా, బలహీనంగా మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
ఏయే ఆహార పదార్థాల్లో ఎంత విటమిన్ E లభిస్తుందంటే..
* 100 గ్రాముల మామిడి ముక్కల్లో 0.9 మైక్రోగ్రాముల విటమిన్ E ఉంటుంది.
* 100 గ్రాముల కివీ పండ్లలో 1.5 మైక్రోగ్రాముల విటమిన్ E లభిస్తుంది.
* అవోకాడోలో 100 గ్రాములకి 2.1 మైక్రోగ్రాముల విటమిన్ E లభిస్తుంది.
* 100 గ్రాముల బ్లాక్‌బెర్రీస్‌లో 1.2 మైక్రోగ్రాముల విటమిన్ E ఉంటుంది
* 100 గ్రాముల పండు మిర్చిలో 1.6 మైక్రోగ్రాముల విటమిన్ E దొరుకుతుంది.
* 100 గ్రాముల పాలకూరలో 2.9 మైక్రోగ్రాముల విటమిన్ E ఉంటుంది.
* 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 35 మైక్రోగ్రాముల విటమిన్ E లభిస్తుంది.
* 100 గ్రాముల బాదంలో 26 మైక్రోగ్రాములు విటమిన్ E ఉంటుంది.
* 100 గ్రాముల వేరుశెనగలో 8.3 మైక్రోగ్రాముల విటమిన్ E లభిస్తుంది.
* 100 గ్రాముల గుమ్మడి గింజలు 2.2 మైక్రోగ్రాములు విటమిన్ Eని అందిస్తాయి.
* 100 గ్రాముల జీడిపప్పులో 0.9 మైక్రోగ్రాముల విటమిన్ E ఉంటుంది.