- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Radhe : ‘రాధే’ రివ్యూ రైటర్‌పై సల్మాన్ పరువు నష్టం కేసు
దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan).. ఈద్ సందర్భంగా ‘రాధే : ది మోస్ట్ వాంటెడ్ బాయ్’ సినిమాతో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై యాక్టర్ కమాల్ ఆర్ ఖాన్ ఇచ్చిన రివ్యూకు వ్యతిరేకంగా ముంబయి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సల్మాన్.. అందుకు సంబంధించి లీగల్ నోటీస్ కూడా పంపించాడు. కాగా నోటీస్ అందుకున్న సమాచారాన్ని ట్విట్టర్ పోస్టు ద్వారా తెలియజేసిన కమాల్ ఖాన్.. ఇకపై సల్మాన్ సినిమాలకు రివ్యూలు రాయనని మరో ట్వీట్ ద్వారా వెల్లడించాడు.
‘నిర్మాత, నటుడు ఎవరైనా తమ సినిమాలకు రివ్యూ ఇవ్వకూడదని చెబితే ఇవ్వనని గతంలోనే చాలాసార్లు చెప్పాను. అయితే సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ రివ్యూ రాసినందుకు తనపై పరువు నష్టం దావా వేశాడంటే, అది తనను చాలా ప్రభావితం చేసినట్టు ఉంది. అందుకే ఇకపై తన సినిమాలకు రివ్యూ రాయను’ అని తెలిపాడు. అంతేకాదు ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదన్న కమాల్.. కేసు వాపస్ తీసుకుంటే రివ్యూ వీడియోను డిలీట్ చేస్తానంటూ సలీమ్ ఖాన్‌కు ట్వీట్ చేశాడు.
https://twitter.com/kamaalrkhan/status/1397181935370260485?s=20