దమ్ముంటే పేర్లు ప్రస్తావించండి.. గాసిప్స్‌పై హీరోయిన్

by Shyam |
దమ్ముంటే పేర్లు ప్రస్తావించండి.. గాసిప్స్‌పై హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్.. సెలబ్రిటీలపై బ్లైండ్ ఐటమ్స్ ప్రచురించేవారిని పిరికిపందలతో పోల్చింది. కోస్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ విషయంపై చాలాసార్లు మాట్లాడిన కృతి.. ఇలాంటి ఐటమ్స్‌‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. రిపోర్టింగ్‌లో భాగంగా.. సెలబ్రిటీల గురించి వారి పేర్లు ప్రస్తావించకుండానే ఎవరనే విషయాన్ని రీడర్ తెలుసుకునే విధంగా క్లూస్ ఇస్తూ గుడ్డిగా వార్తలు రాయడం జర్నలిజం అనిపించుకోదని అభిప్రాయపడింది. ‘ఇది చాలా అసహ్యకరమైన విషయం, గాసిప్ ముసుగులో రాసే వార్తల్లో ఎక్కువ శాతం నిజం కావు. ఒకవేళ మీకు నిజం తెలిస్తే పేర్లు రాయండి. మిమ్మల్ని ఎవరూ ఆపరు? అంతేకాని గాసిప్స్ క్రియేట్ చేయకండి. ఎందుకంటే ఇది మానసికంగా వేధిస్తుంది, వ్యక్తుల కుటుంబాలను అంతకు మించి ప్రభావితం చేస్తుంది’ అని భావిస్తున్నట్తుగా చెప్పింది. అంతేకాదు కొన్నిసార్లు ఇది రిలేషన్‌షిప్స్ బ్రేక్ అయ్యేందుకు కారణమవుతుందని, ఇలాంటి వాటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. కాగా పంకజ్ త్రిపాఠితో కలిసి ‘మిమి’ చిత్రంలో నటిస్తున్న కృతి.. ఇందులో సరోగేట్ తల్లి పాత్రలో కనిపించనుంది.

Advertisement

Next Story

Most Viewed