సీత కోసం వెతుకులాట ముగిసినట్టేనా?

by Shyam |
సీత కోసం వెతుకులాట ముగిసినట్టేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘చెడు మీద మంచి విజయం సాధిస్తుంది’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడిగా కనిపించనున్న సినిమాలో సీత కోసం వెతుకులాట ముగిసినట్లే కనిపిస్తుంది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫైల్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సీత పాత్ర కోసం అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కీర్తి సురేష్, కియారా అద్వానీని సంప్రదించారని రూమర్స్ వచ్చాయి. కానీ ఇదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు దర్శక, నిర్మాతలు.

తాజాగా సీతగా మరో బాలీవుడ్ నటి పేరు తెరమీదకు వచ్చింది. యాక్టింగ్‌లోనే కాదు పొయెటిక్ వేలోనూ అదరగొడుతున్న కృతి సనన్.. డార్లింగ్‌తో జోడీ కట్టబోతుందని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది. ఇప్పటికే ఐదు సినిమాలను లైన్‌లో పెట్టిన కృతి.. ఆదిపురుష్ ప్రాజెక్ట్‌ను కూడా ఓకే చేసిందని బీటౌన్ టాక్. దీంతో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా బిజీ షెడ్యూల్‌లో ఉండనుందట భామ. ప్రస్తుతం రాజ్ కుమార్ రావుతో ‘హమ్ దో హమారే దో’ షూటింగ్‌లో పాల్గొంటున్న కృతి.. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ కంప్లీట్ చేయనుంది. ఇక వరుణ్ ధావన్‌తో ‘భేడియా’ చేయనున్న కృతి.. మిమి సినిమాలో సరోగేట్ మదర్‌గా కనిపించనుంది.

కాగా ఆదిపురుష్ సినిమా కోసం అవతార్, వార్ సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులను కాంటాక్ట్ చేస్తున్నారట దర్శకులు ఓం రౌత్. కాగా ఈ మైథలాజికల్ ఫిల్మ్ 11 ఆగస్టు, 2022లో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story