- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లేటెస్ట్ అప్‌డేట్ : ‘క్రాక్’ రిలీజ్ ఆగిపోయింది?
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ విడుదల ఆగిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూస్‌తో అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయలేకపోయారు ఫిల్మ్ మేకర్స్. దీంతో అభిమాన హీరో చిత్రం విడుదలవుతుందని థియేటర్ల దగ్గర పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే టికెట్ బుక్ చేసుకుని, భారీ అంచనాలతో వచ్చిన ఫ్యాన్స్.. మేకర్స్‌ను తిట్టిపోస్తున్నారు. ఒకవేళ మార్నింగ్ షో మిస్ అయినా.. మ్యాట్నీ షోతో సినిమా థియేటర్లలోకి వస్తుందనుకున్నా.. ‘క్రాక్’ అసలు ఈ రోజు రిలీజ్ కాదనే టాక్ వినిపిస్తోంది.
‘క్రాక్’ సినిమాను నిర్మించిన ఠాగూర్ మధు.. గతంలో ఎన్టీఆర్ – పూరీజగన్నాథ్ ‘టెంపర్’ సినిమాను తమిళ్‌లో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేశాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ‘అయోగ్య’ టైమ్‌లో ఏర్పడిన ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత మోసం చేశాడని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్క్రీన్ సీన్ మీడియా కోర్టుకు వెళ్లింది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు చెల్లించాకే ‘క్రాక్’ రిలీజ్‌కు అనుమతించాని డిమాండ్ చేశారు.