కొరటాలకు ఓకే చెప్పిన బన్నీ..

by Shyam |
కొరటాలకు ఓకే చెప్పిన బన్నీ..
X

కొరటాల శివ.. డైరెక్టర్‌గా తన తొలి చిత్రం మిర్చితోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను’ వంటి కమర్షియల్ సినిమాల్లోనూ సొసైటీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే కంటెంట్‌ను యాడ్ చేస్తూ అపజయాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘ఆచార్య’ కూడా సందేశాత్మక చిత్రం కాగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తోనూ సినిమా చేయబోతున్నాడట కొరటాల. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టకేలకు వీరిద్దరి కలయికలో సినిమా కన్‌ఫర్మ్ అయిందని సమాచారం.

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ మధ్య కొరటాల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన కథ బన్నీకి నెరేట్ చేశాడంట. ఇది కాస్త వెరైటీ సబ్జెక్ట్ కావడం, అందులోనూ మెసేజ్ ఉండటంతో అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్ట్‌ ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్.

కాగా ప్రస్తుతం కొరటాల, బన్నీ తమ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేశాకే.. ఈ చిత్రం గురించి ఆలోచించే చాన్స్ ఉంది.

Advertisement

Next Story