- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాక్ టు టైప్.. ‘కూ’ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో న్యూ ఫీచర్
దిశ, ఫీచర్స్ : ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన దేశీ యాప్ ‘కూ’.. రోజురోజుకూ తమ వినియోగదారులను పెంచుకుంటోంది. ఈ క్రమంలో న్యూ కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు సరికొత్త ఫీచర్స్ యాడ్ చేస్తున్న ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్.. తాజాగా ‘టాక్ టు టైప్’ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది హిందీ, కన్నడ, బెంగాలీ సహా వివిధ భారతీయ భాషల్లో లభిస్తుండగా.. త్వరలోనే అన్ని భారతీయ భాషలను సపోర్ట్ చేయనుందని మేకర్స్ వివరించారు. కాగా వినియోగదారులు టైప్ చేయకుండానే వారి ఆలోచనలను సులభంగా పంచుకునేందుకు ఈ ఫీచర్ వీలు కల్పించనుంది.
‘టాక్ టు టైప్’ అనే మ్యాజికల్ ఫీచర్.. ప్రాంతీయ భాషా కంటెంట్ క్రియేటర్స్‌కు కొత్త అనుభూతినిస్తుందని వెల్లడించిన యాప్ డెవలపర్స్.. ఇప్పటివరకు కీబోర్డ్ మాట్లాడితే, ఇకపై తమ మనసు మాట్లాడనుందని అంటున్నారు. ఈ మేరకు వినియోగదారులు ఇకపై కీబోర్డ్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేకపోగా, ఆలోచనలన్నీ క్షణాల్లో అక్షరాలుగా మారిపోనున్నాయి. స్థానిక భాషల్లో టైప్ చేయడం కష్టమనిపించిన వారికి ఈ ఫీచర్ సూపర్‌గా ఉపయోగపడనుందని, ఇటువంటి ఫీచర్ తీసుకొచ్చిన మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘కూ’ అని వారు అభిప్రాయపడ్డారు.
కాగా మైక్రోబ్లాగింగ్ సైట్ అయిన ‘కూ’ యాప్‌ను అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిద్వాట్కా కలిసి స్థాపించారు. 2020లో ప్రారంభమైన ఈ యాప్.. ప్రభుత్వ ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్ గెలిచిన తర్వాత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది అచ్చం ట్విట్టర్‌ను పోలి ఉండటం విశేషం.