కాంగ్రెస్‌పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shyam |
konda
X

దిశ, రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్టానానికి అవగాహన లేదని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అపోలో, జేకేఎమ్మార్ ఫౌండేషన్ సహకారంతో ఆదివారం శంషాబాద్ మున్సిపాలిటీలోని యాదవ బస్తీలో19 వార్డ్ కౌన్సిలర్ సంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆమన మాట్లాడారు. దేశం మొత్తం కరోనా వచ్చే రెండేళ్లు గడిచిందని, తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కేర్ బడ్జెట్‌ పెంచాలన్నారు. వైద్య శిబిరాలు పెట్టడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంతో కీలకంగా పనిచేస్తున్నాయి కానీ తెలంగాణలో ఎక్కడ సరిగా పని చేయడం లేదని విమర్శించారు.

గ్రామగ్రామాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అన్నారు. కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా విజృంభిస్తుందని హుజురాబాద్ ఎన్నికలు వాయిదా వేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యా సంస్థలను ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నా రాజకీయ భవిష్యత్తు గతంలో లాగానే ఉంటుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడుతూ ఉంటానని, నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను కానీ పార్టీల మాత్రమే అటు ఇటు ఊగిసలాడుతున్నాయని తెలిపారు.

రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రంపై అవగాహన లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌తో కొట్టాడుతుంటే.. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటుందా అనే దానిపై క్లారిటీ ఇచ్చినప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు జల్లపల్లి నరేందర్, నాయకులు శ్రీధర్ యాదవ్, కుమార్, సంతోష్, ప్రమీల, కృష్ణయ్య, చందు, డాక్టర్లు అభిషేక్ రెడ్డి, నిషా,ని రుపమ, రోహిత్, శంతన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed