- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన కోమటిరెడ్డి
దిశ, మర్రిగూడ : మునుగోడు నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న శివన్నగూడెం, కిష్టరాంపల్లి ప్రాజెక్టుల్లో ముంపునకు గురవుతున్న 7 గ్రామాల భూ నిర్వాసితులకు వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ జీరో అవర్లో ఆయన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో జాప్యం చేయడంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రెండు ప్రాజెక్టులకు హెడ్ వర్క్స్ నేటికీ పూర్తికాకపోవడంతో నీరు ఎక్కడికెళ్లి వస్తుందో తెలియని పరిస్థితి దాపురించిందని, హెడ్ వర్క్స్ కంప్లీట్ అయిన తరువాతనే రెండు ప్రాజెక్టుల పరిధిలో పనులు ప్రారంభించాలని కోరారు. అప్పటివరకు భూ నిర్వాసితుల భూముల్లో రైతులు పనులు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పోలీసులతో భూ నిర్వాసితులను బెదిరింపులకు పాల్పడకుండా చూడాలని ఆయన కోరారు.