- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి నేనేంటో చూపిస్తా.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమైందని, కామారెడ్డి– ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం చేపట్టనున్నానని, ఇక నుంచి తానేంటో చూపిస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత వీహెచ్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి తానేంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన ప్రాణమన్నారు. ‘‘కామారెడ్డిలోని ఎల్లారెడ్డి నుంచి తన ఉద్యమం మొదలుపెడతానని, రేపట్నుంచి తానేంటో చూపిస్తానని, కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమని, సోనియా గాంధీ దేవత అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడరని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే ప్రాణమిచ్చే వ్యక్తి వీహెచ్ అని, ఆయన లాంటి నేతలంటే తనకెంతో గౌరవమన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవత అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వస్తుందని ఎవరైనా కలలోనైనా అనుకున్నామా అని వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదని, పార్టీని ఎలా బతికించుకోవాలో ఆలోచిస్తున్నామని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పెద్ద లీడర్లు అని చెప్పుకునే నేతలే పదవులను పంచుకున్నారంటూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.