- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా బారిన పడ్డ ప్రముఖ హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు కరోనా ఎవరిని వదలడం లేదు. ఇప్పటీకే చిత్ర పరిశ్రమలో పలువురు నటీనటులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. కోలీవుడ్ హీరోయిన్, సింగర్ ఆండ్రియా జెరెమియాకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ” ప్రియమైన అందరికి, గత వారం నేను కోవిడ్ -19 పరీక్షచేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. వెంటనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పటికీ నేను క్వారంటైన్ లోనే ఉన్నాను. కానీ కోలుకున్నా.. నన్ను జాగ్రత్తగా చూసుకున్న నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అందరు జాగ్రత్తగా ఉండండి ” అంటూ పోస్ట్ చేసింది. ‘యుగానికి ఒక్కడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆండ్రియా.. తాజాగా ఇలయదళపతి విజయ్ ‘మాస్టర్’ చిత్రంలోనూ అలరించారు.ఆండ్రియా కరోనా బారిన పడిన సంగతి తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.