- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమెరికా టీ20 లీగ్‌లో షారుక్ పెట్టుబడులు
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లలో ఫ్రాంచైజీలు కలిగి ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఈ సారి ఏకంగా టీ20 లీగ్‌లో పెట్టుబడులు పెట్టనున్నారు. అమెరికన్ క్రికెట్ ఎంటర్‌ప్రైజెస్ (ఏస్) అనే అమెరికా సంస్థ 2022లో అక్కడ భారీ క్రికెట్ లీగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు ఆ ‘ఏస్’ సంస్థతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కట్టనుంది.
ఏస్ ప్రారంభించే ఆ టీ20 లీగ్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా.. క్రికెట్ అభివృద్ది కార్యాకలాపాల్లో కూడా కేకేఆర్ పాలుపంచుకోనుంది. షారుక్‌తో పాటు కేకేఆర్ సహా యజమానులు జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా కూడా ఈ లీగ్‌లో భాగస్వామ్యం కానున్నారు. ఈ మేరకు ఏస్, కేకేఆర్ మధ్య ఒప్పందం కుదిరినట్లు షారుక్ తెలిపారు. ‘అమెరికాలో ప్రారంభం కానున్న భారీ క్రికెట్ లీగ్‌లో తమ కేకేఆర్ భాగస్వామి కానున్నది. కేకేఆర్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాము.
రాబోయే కొన్నేళ్లలో కేకేఆర్ ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్స్ జరిగినా.. అందులో పాల్గొనేలా వ్యూహం రచిస్తున్నాము’ అని షారుక్ తెలిపారు. ఇప్పటికే రెండు క్రికెట్ ఫ్రాంచైజీలు కలిగి ఉన్న షారుక్.. భవిష్యత్‌లో అన్ని క్రికెట్ లీగ్స్‌లో తమ ముద్ర వేయాలని భావిస్తున్నారు.