- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫిబ్రవరిలో మిలియన్ మార్చ్: కోదండరాం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి మూకుమ్మడిగా నడుం బిగిద్దామన్న కోదండరాం.. ఈనెల 20వరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చివరగా చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి.. ఫిబ్రవరి మూడో వారంలో మిలియన్ మార్చ్ చేపడుతామని స్పష్టం చేశారు. ‘బతుకుదెరువు నిలబెట్టాలి-తెలంగాణను కాపాడాలి’ నినాదంతో నాంపల్లి టీజేఎస్ కార్యాలయంలో 48గంటల దీక్ష చేపట్టిన కోదండరాం సోమవారం సాయంత్రం విరమించారు. నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
Next Story