రెండు పంటలకు సరిపడా నీరందిస్తాం

by Shyam |   ( Updated:2020-09-06 08:10:39.0  )
రెండు పంటలకు సరిపడా నీరందిస్తాం
X

దిశ, కోదాడ: సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకూ నీరందిస్తామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సాగర్ మేజర్ కాల్వను ఆయా గ్రామాల్లో ఉన్న తూములను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సాగర్ ఆయకట్టు పరిధిలో చివరి భూముల రైతులకు కూడా రెండు పంటలకు సరిపడా నీరందేలా కృషి చేస్తానన్నారు. రైతుల అవసరాల మేరకు ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణం పెరిగినందువల్ల రెండు పంటలు పండించేందుకు కాలువలు ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.

Advertisement

Next Story