IPL : అదరగొట్టిన CSK ఓపెనర్స్.. KKR ఎదుట భారీ లక్ష్యం

by Shyam |
IPL : అదరగొట్టిన CSK ఓపెనర్స్.. KKR ఎదుట భారీ లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ -2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు కేకేఆర్ ఎదుట భారీ లక్ష్యాన్ని విధించింది. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే జట్టు 3వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగులు చేస్తే కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలవనుంది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ 32, ఉతప్ప 31 పరుగులు చేసి వెనుదిరగగా.. ఓపెనర్ డుప్లిసిస్ కేవలం 59 బంతుల్లో 86 పరుగులు చేసి చెన్నై జట్టుకు భారీ పరుగులు సాధించిపెట్టాడు. ఇకపోతే మరో ఆటగాడు మోయిన్ అలీ 37 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు, మావి ఒక వికెట్ తీసి చెన్నై భారీ జట్టు భారీ పరుగుల వరద పారించకుండా అడ్డుకట్ట వేయగలిగారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed