- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిష్టారాంపల్లి నిర్వాసితులను ఆదుకోవాలి: రాజగోపాల్‌రెడ్డి
దిశ, నల్లగొండ: కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో గత ఆరేళ్లుగా రైతులు తమ బాధలు చెబుతూనే ఉన్నారని తెలిపారు.
కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులను పెట్టి పనిచేయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరానికి ఓ న్యాయం, తమ ప్రాంత ప్రాజెక్టులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. తక్షణమే కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం నిరాహారదీక్ష చేసైనా సరే సీఎం కండ్లు తెరిపిస్తామని ఆయన ప్రకటించారు. ప్రాజెక్టు విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తే ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.