టీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

by Shyam |   ( Updated:2020-07-12 20:42:38.0  )
టీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య దాడి సంచలనం రేపింది. దీనిపై ఇప్పటికే ఇరు పార్టీల నేతలు గుర్రుగా ఉన్నారు. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిచారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తల చర్య సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి అణచివేత దోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలపై దాడి గురించి సంబంధిత పోలీసు అధికారులు వివరణ ఇచ్చామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story