జిన్‌పింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన కిమ్

by vinod kumar |   ( Updated:2020-05-08 10:13:51.0  )
జిన్‌పింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన కిమ్
X

ప్యాంగ్యాంగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చైనా విజయం సాధించిందని.. దీనికి ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ అనుసరించిన విధానాలే కారణమని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసించారు. జిన్ పింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ కిమ్ ఒక లేఖను పంపించారని ఉత్తర కొరియా అధికారికి మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. కరోనాను నియంత్రించిన తీరు అభినందనీయమంటూ కిమ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఈ వైరస్‌ను చైనా సమర్థవంతంగా ఎదుర్కొన్నదని కిమ్ చెప్పారు. మూడు వారాల పాటు అజ్ఞాతంలో ఉన్న కిమ్ ఇటీవలే ప్రజల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన చైనాను కీర్తిస్తూ సందేశం పంపారు. మరోవైపు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags: North Korea, Kim Jong, Un, Xi Jinping, Coronavirus, Covid 19

Advertisement

Next Story