ట్రాఫిక్ అంతరాయం లేకుండా కిడ్నీలు తరలింపు

by Shyam |
ట్రాఫిక్ అంతరాయం లేకుండా కిడ్నీలు తరలింపు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: కోల్‌కతా నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న రెండు కిడ్నీలు, లివర్‌ను బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించడంలో నగర ట్రాఫిక్ పోలీసులు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి 36.8 కిలోమీటర్ల దూరం ఉండగా అంబులెన్స్‌కు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూశారు. కోల్‌కతా నుంచి సోమవారం ఉదయం 6.39 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రెండు కిడ్నీలు, ఒక లివర్‌ను 30నిమిషాల్లో (ఉదయం 7.09 గంటలకు) బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి చేర్చారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లైవ్ ఆర్గన్స్‌ను ఆస్పత్రికి చేర్చడంలో చేసిన ప్రయత్నాలు విలువైన ప్రాణాలను రక్షించడంలో ఎంతో దోహదపడినట్టు కిమ్స్ హాస్పిటల్ ప్రశంసించింది. ఈ ఏడాది 2020లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 5సార్లు అవయవ రవాణా సమయాలను సులభతరం చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed