సిద్ధుతో మాల్దీవ్స్‌ చెక్కేసిన కియార.. డేటింగ్‌పై ఓపెన్

by Shyam |
సిద్ధుతో మాల్దీవ్స్‌ చెక్కేసిన కియార.. డేటింగ్‌పై ఓపెన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రిలేషన్‌షిప్‌లో ఉందని బీటౌన్‌లో ఎప్పటి నుంచో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయినా వీరిద్దరు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మీడియా ముందు అంగీకరించలేదు. కానీ 2021కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు మాల్దీవ్స్ వెళ్తున్న ఈ జంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న క్రమంలో ఒకే కారు నుంచి దిగడం.. అక్కడ కెమెరా కళ్లకు చిక్కడంతో ఒప్పుకోక తప్పలేదు. ఎలాగూ మీడియా ఇద్దరిని ఒకేసారి క్యాచ్ చేసింది కదా! అని డిసైడ్ అయ్యారో ఏమో కానీ.. మాల్దీవ్స్‌లో ల్యాండ్ అయ్యాక సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. వెకేషన్‌కు వెళ్లినప్పుడు ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడే ఈ రహస్య ప్రేమికులు.. ఒకే ప్లేస్‌లో ఉన్నట్లు తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫొటోలు షేర్ చేసి, డేటింగ్‌పై ఓపెన్ అయిపోయారు. దీంతో వీరిద్దరూ తమ సీక్రెట్ రిలేషన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి 2021 నుంచి కలిసే ఉందామనుకుంటున్నారా? లేక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారా? అని క్వశ్చన్స్ వేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story