- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తొలి కియా సోనెట్ కారు ఆవిష్కరణ
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ ప్లాంట్‌లో కియా మోటార్స్ ఇండియా (Kia Motors India) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సోనెట్ ఎస్‌యూవీ (Kia Sonet SUV)ని ఆవిష్కరించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని త్వరలో దీన్ని లాంచ్ చేయనున్నట్టు, దేశీయంగానే కాకుండా విదేశీ మార్కెట్ల (Foreign markets)లో కూడా విక్రయాలు జరపనున్నట్టు కంపెనీ వెల్లడించింది. కియా సోనెట్ (Kia Sonet) సంస్థ నుంచి వస్తున్న కొత్త ‘మేడ్-ఇన్-ఇండియా’ ఉత్పత్తి (‘Made-in-India’ product).
మిడ్-ఎస్‌యూవీ (Mid-SUV) సెగ్మెంట్‌లో కియా సెల్టోస్ (Kia Celtos) మాదిరిగానే మార్కెట్లలో విక్రయించబడుతుందని కంపెనీ తెలిపింది. దీన్ని సెప్టెంబర్ 18న భారత మార్కెట్లో( Indian market) విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. కియా సోనెట్ కోసం ఇప్పటికే భారీ ఎత్తున బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.
వివిధ వాతావరణ పరిస్థితుల్లో సుమారు లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించిన తర్వాత ఈ కార్‌ను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. ఎక్కువ సంఖ్యలో కార్ల ఉత్పత్తిని చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70 మార్కెట్లలో కియా సొనెట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కియా మోటార్స్ ఇండియా సీఎవో క్యూఖ్యూన్ షిమ్ చెప్పారు. ప్రపంచ మార్కెట్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో కియా సొనెట్‌ను తీసుకురావడం గర్వంగా ఉందని, తమ ప్లాంట్ ఉద్యోగుల అంకితభావానికి ఇది నిదర్శనమని ఆయన తెలిపారు.