- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నేను బీజేపీలో చేరడమేంటి’
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన నూతన విద్యా విధానంపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ స్వాగతించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తమిళనాడు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కుష్బూ పార్టీ మారుతున్నారని వార్తలు బలంగా వినిపించాయి. బీజేపీలో చేరేందుకు కుష్బూ ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో తాను పార్టీ మారుతానన్న విషయంపై కుష్బూ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై కేవలం తన వ్యక్తి గత అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించనని తెలిపారు. దీనిని సాధారణంగా చూడాల్సిందే తప్ప అనవసరంగా విమర్శలు చేస్తే ప్రయోజనం ఉండదన్నారు. తాను కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటానని వివరించారు. అధికార, ప్రతిపక్షంలో ఉన్నా దేశ భవిష్యత్తు కోసం పనిచేయాలని హితవు పలికారు. సంఘీయులారా శాంతించండి.. ఇప్పుడే సంతోషించకండి.. అంటూ.. తానేమి బేజేపీలో చేరడం లేదని కుష్బూ తేల్చి చెప్పారు.