- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రేమికుల మర్మాంగాలపై వాతలు పెట్టి..
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమికులకు ప్రైవసీ దొరికితే అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదు. ఇద్దరు ఏకాంతంగా గడపడానికి అదొక్కటే అనువైనది. ఇలాంటి అవకాశం ఓ ప్రేమ జంటకు వచ్చింది. ప్రియురాలు పిలిచిందని హుటాహుటిన వచ్చిన ప్రియుడికి ఆ గ్రామ పెద్దలు ఊహించని విధంగా అవమానించారు. పంచాయితీ పేరుతో మర్మాంగాల పై వాతలు పెట్టి.. నగ్నంగా ఊరేగించి పైశాచిక ఆనందం పొందారు. చివరకు పోలీసుల ఎంట్రీతో పరారీ అయ్యారు. ఈ అమానుష ఘటన బీహార్‌లో కలకలం రేపింది. మరీ ఇంత దారుణమైన ఘటనకు పాల్పడ్డ గ్రామస్తుల పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీహార్‌లోని కటిహార్ జిల్లా డండ్ఖోరాలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి.. వేరే సామాజిక వర్గం, వేరే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత శుక్రవారం రోజు ఇద్దరు కలుసుకున్నారు. ఏకాంతంగా వీరు కలిసిఉండటం గమనించిన పలువురు వ్యక్తులు.. ఆ నగ్న దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ బెదిరించడమే కాకుండా.. యువతి ప్రైవేట్ భాగాలపై చేతులు వేసి హింసించారు.
ఆ తర్వాత కూడా విడిచిపెట్టకుండా.. బాధితులను ఖాప్ పంచాయితీ ముందుకు తీసుకొచ్చారు. గ్రామస్తుల ముందు నగ్న ప్రదర్శన చేయడంతో బాధితులు అవమానం భారంతో అక్కడే సగం చనిపోయేంత పనైంది. అంతటితో ఆగక ఖాప్ పంచాయితీ కూడా అమానుషంగా వ్యవహరించింది. వేరు-వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు ఎలా కలిసి ఉంటారని.. యువతి-యువకుడు నగ్నంగా ఉండగానే.. ఓ రాడ్డును వేడి చేసి మర్మాంగాలపై కాల్చి.. రూ. 2.25 లక్షల జరిమానా విధించడం దారుణం.
ఆ తర్వాత ప్రేమికులను నగ్నంగానే ఊరేగింపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని బాధితులను రక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని.. ఘటనకు కారకులు పరారీలో ఉన్నారని.. ఎలాగైన అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఖాప్ పంచాయితీలు ఇంత అవమానకరంగా వ్యవహరిచండం బీహార్‌లో కలకలం రేపుతోంది. ఈ కాలంలో కూడా ఇటువంటి ఆకృత్యాలు ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.