థియేటర్‌లో మాన్‌స్టర్.. కేజీఎఫ్‌ 2 విడుదలపై బిగ్ అనౌన్స్‌మెంట్..!

by Anukaran |
థియేటర్‌లో మాన్‌స్టర్.. కేజీఎఫ్‌ 2 విడుదలపై బిగ్ అనౌన్స్‌మెంట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కీలక ప్రకటన వచ్చేసింది. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపుతున్న కేజీఎఫ్‌ చాప్టర్‌ 2పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. థియేటర్లలోనే సినిమా విడుదల చేయనున్నట్టు అభిమానులకు శుభవార్త అందించింది. థియేటర్ మొత్తం గ్యాంగ్‌స్టర్‌(అభిమానులు)లతో నిండిపోయినప్పుడే మాన్‌స్టర్(కేజీఎఫ్) వేట మొదలవుతోంది.. అతి తర్వలోనే మాన్‌స్టర్ వచ్చే డేట్‌ ఫిక్స్ చేస్తాం అంటూ మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ఈ వార్త విన్న అభిమానులు అనౌన్స్‌మెంట్ ఇంకెప్పుడు అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు.

యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడంతో.. సెకండ్ ‌పార్ట్‌ అంచనాలకు మించకూడదని ఎన్నో మార్పులు చేశాడు దర్శకుడు. అందుకే సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, రావు రమేష్‌ కేజీఎఫ్‌ 2లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Next Story