తక్కువ ధరల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్.. కేరళ స్టూడెంట్స్ సృష్టి..

by Shyam |
concentrator
X

దిశ, ఫీచర్స్ : కరోన మహమ్మారి సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ విపత్కర పరిస్థితులకు కేరళ పెద్దగా ప్రభావితం కానప్పటికీ, ఇక్కడ కూడా ప్రజలు ఆందోళన చెందారు. ఇక ప్రస్తుతం కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవడం లేదు కానీ మళ్లీ విజృంభించదనే గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో త్రిసూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం ఆక్సిజన్ కొరత తీర్చేందుకు గాను తక్కువ ధరల్లో ‘ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్’ రూపొందించింది.

గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న మెకానికల్, ఎలక్ట్రికల్ విద్యార్థుల బృందం.. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను రూపొందించింది. ఈ నమూనాను ఇటీవలే త్రిసూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి అందజేశారు. మార్కెట్‌లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉన్నప్పటికీ, విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు వాటి సంఖ్య చాలదు. అంతేకాకుండా దిగుమతి చేసుకున్న పరికరాలు కేరళ వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక పాడైపోతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న విద్యార్థులు కేరళ వెదర్‌కు సరిపోయే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ తయారుచేశారు.

‘మా పరికరం వాతావరణంలోని గాలి నుంచి ఆక్సిజన్‌ను వేరు చేసి శుద్ధి చేస్తుంది. ఏకకాలంలో కనీసం నలుగురు పేషెంట్లు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆక్సిజన్ కోసం బబుల్ స్టోరేజీ సిస్టమ్స్ అందుబాటులో లేకపోవడం ఆస్పత్రులు ఎదుర్కొంటున్న మరో సమస్య. అయితే, ఈ అయోవా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఆక్సిజన్‌ను సమర్థవంతంగా ఉత్పత్తి చేసి సరఫరా చేయగలదు. ఆస్పత్రులతో పాటు ఇళ్లలోనూ ఉపయోగించవచ్చు. మార్కెట్‌లోని ఇతర కమర్షియల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌తో పోలిస్తే, ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయడానికి మేము రూ. 1.4 లక్షలు వెచ్చించాం. భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తే 80,000 రూపాయల వరకు మాత్రమే ఖర్చవుతుంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed