- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం మొబైల్ యాప్
దిశ, ఫీచర్స్: వ్యర్థాల తొలగింపును పర్యవేక్షించడంతో పాటు స్థానిక సెల్ఫ్ గవర్నింగ్ సంస్థల్లో అకర్బన వ్యర్థాలను సమర్థవంతంగా సేకరింపజేసేందుకు కేరళ అధికారులు స్మార్ట్ సెల్యులార్ అప్లికేషన్‌ను ప్రారంభించనున్నారు. కేరళవ్యాప్తంగా ఏటా 3.7 మిలియన్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో 31 శాతం నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఈ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ మొత్తాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగానే ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
యాప్ ప్రత్యేకతలు..
కేరళ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్, కెల్ట్రాన్.. ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయనుంది. ముందుగా మొత్తం ఆరు మున్సిపల్ కంపెనీలు, 70 మునిసిపాలిటీలు, 300 గ్రామీణ సంస్థల్లో ప్రారంభించనున్నారు. ప్రతీ ఇంటి నుంచి సేకరించిన నాన్-బయోడిగ్రేడబుల్ వ్యర్థాల పరిమాణాన్ని గుర్తించి, వాటిని శుద్ధి చేయడానికి అవసరమైన మార్గాలను అందించేందుకు ఈ యాప్ సాయపడుతుంది. అన్ని గృహాలకు క్యూఆర్ కోడ్స్ కేటాయించడం ద్వారా వివరాలు రూపొందించబడతాయని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్ ఎంవీ గోవిందన్ మాస్టర్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా చెత్త నిర్మూలన సమర్థవంతంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఒక్కో ప్రాంతం నుంచి సేకరించిన వ్యర్థాల పరిమాణంతో పాటు ప్రతీ స్థానిక సంస్థలో వ్యర్థాల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఈ యాప్ సహాయం చేస్తుంది. ఈ డేటా.. వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను అభివృద్ధి చేయడంలో సంబంధిత స్థానిక సంస్థకు హెల్ప్ చేస్తుంది. రీసైకిల్ చేయదగిన విలువ ఆధారంగా సేకరించిన చెత్త ‘బల్బులు, PVC, స్టీల్, ట్యూబ్స్, సీసాలు, ఇ-వ్యర్థాలు, బాటిల్ క్యాప్స్, స్ప్రే బాటిళ్లు’గా విభజించబడుతుంది. ఇలా సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపిస్తారు. ఇక గృహసంబంధమైన నాన్-బయోడిగ్రేడబుల్ చెత్తను సేకరించి క్లీన్ కేరళ కంపెనీ లిమిటెడ్‌కు పంపిణీ చేస్తారు. బాధ్యులైన స్థానిక సంస్థ చెత్త సేకరణకు సంబంధించి తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే, ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు. అది ఉన్నతాధికారులకు ఫార్వార్డ్ చేయబడుతుంది.