పియానో ప్లే చేస్తున్న వివేక్.. నివాళి అర్పిస్తున్న సినీలోకం

by Jakkula Samataha |   ( Updated:2021-04-17 06:45:13.0  )
Tamil comedian Vivek
X

దిశ, సినిమా : గుండెపోటుతో ఈ రోజు(శనివారం) ఉదయం 4.30 గంటలకు ప్రముఖ కమెడియన్ వివేక్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని తమిళనాడు సర్కారు అధికారులను ఆదేశించింది. కాగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు వివేక్‌కు నివాళులర్పిస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కమెడియన్ వివేక్‌ పియానో ప్లే చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన కీర్తిసురేశ్.. ‘గొప్ప లెజెండ్‌తో నటించే అదృష్టం నాకు దక్కలేదు.

కానీ ఆయనతో జరిపిన సంభాషణలు జీవితాంతం గుర్తుంచుకుంటా. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచిన వివేక్ సర్.. విలువలు నేర్పిన గురువు. తమిళ్ సినిమా తనను ఎప్పటికీ మిస్ అవుతుంది. రెస్ట్ ఇన్ పీస్ సర్’ అని ట్వీట్ చేసింది. తన జీవితంలో నేర్చుకున్న విలువలను కామెడీలో జొప్పించి, తనదైన స్థాయిలో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వివేక్.. నిజమైన సోషల్ యాక్టివిస్ట్ అని తెలిపింది. ఇంకా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Advertisement

Next Story