- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం.. ప్రధాని పేరిట అభిషేకం
by Shamantha N |
X
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ కేదార్‌నాథ్ ఆలయం బుధవారం ఉదయం 6:10 గంటలకు తెరుచుకుంది. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా భక్తులెవరికీ అనుమతి లేకపోవడంతో, ఆలయ ద్వారాలు తెరిచే సమయంలో తొలిసారి భక్తులు లేక ప్రాంగణమంతా బోసిపోయినట్టు కనిపించింది. ఆలయ ప్రధాన పూజారి సహా 20మంది మాత్రమే హాజరై, మొదట ప్రధాని మోడీ పేరిట శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి-యమునోత్రి ప్రధాన ద్వారాలు తెరవగా, బద్రీనాథ్ ద్వారాలు వచ్చే నెల 15న తెరవనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, క్వింటాళ్ల కొద్దీ పుష్పాలతో ఆలయాన్ని అలంకరించినట్టు వెల్లడించారు. దేశంలో కరోనా తీవ్రత తగ్గిన తర్వాత చార్ధామ్ యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు.
Tags: kedarnath temple, devotees not allowed, dehradun, uttarakhand, lockdown, chardham pilgrim
Advertisement
Next Story