టీడీపీకి మరోపెద్ద షాక్

by srinivas |
KE
X

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పార్టీకి పరమ విధేయుడిగా ఉన్న కరణం బలరాం పార్టీ వీడడమే పెద్ద షాకనుకుంటే.. గత టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన కేఈ కృష్ణమూర్తి సోదరుడు టీడీపీకి రాంరాం చెప్పడం కలకలం రేపుతోంది.

కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మనుగడ లేదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీగా తాను అడిగిన కార్పొరేట్లకు టిక్కెట్లిచ్చే స్థితిలో పార్టీ లేదని ఆయన ఆరోపించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీజేపీ నేత కనుసన్నల్లో పని చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీలో అవమానాలు భరించలేకే తాను పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

పార్టీ వీడుతున్నట్టు ప్రకటించిన ఆయన ఏ పార్టీలో చేరేది వెల్లడించలేదు. త్వరలోనే తానే పార్టీలోచేరేది చెబుతానని పేర్కొన్నారు. కాగా, ప్రభాకర్ రాజీనామాపై ఆయన సోదరుడు కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ, రాజీనామాపై తనతో చర్చించలేదని అన్నారు. తన తమ్ముడు వైఎస్సార్సీపీలో చేరినా అభ్యంతరం లేదని తెలిపారు. ప్రభాకర్ రాజీనామా టీడీపీలో కలకలం రేపుతోంది.

Tags: ke prabhakar, ke krishnamurthy, kurnool, dhone

Advertisement

Next Story