- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7 కోట్ల ప్రశ్న.. గర్ల్ ఫ్రెండ్ or రోహిత్ శర్మ? తేల్చుకోమన్న అమితాబ్!
దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ షోలో పాల్గొని సామాన్యుల నుంచి మిలియనీర్లుగా మారిన వారున్నారు. సాధారణంగా హాట్ సీట్‌లో కూర్చున్న వారు బచ్చన్ జీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు టెన్షన్ పడుతుంటారు. కానీ ఫస్ట్ టైమ్ ప్రాంశు త్రిపాఠి అనే కంటెస్టెంట్.. అమితాబ్‌నే పగలబడి నవ్వించడం విశేషం.
‘క్రికెటర్ రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టం. నా వాలెట్‌లో ఆయన ఫొటో ఎప్పుడూ ఉంటుంది’ అని అమితాబ్‌కు ఫొటో చూపించాడు త్రిపాఠి. అయితే ‘నీ ప్రేయసి అనామిక, రోహిత్ శర్మ’ వీరిద్దరిలో ఒక్కరే అంటే ఎవరిని ఎన్నుకుంటావు’ అని బిగ్ బీ ప్రశ్నించాడు. దీనికి స్పందించిన త్రిపాఠి.. ‘ఇది రూ. 7 కోట్లకు సంబంధించిన ప్రశ్న కంటే కఠినమైంది. పైగా నాకు లైఫ్‌లైన్ కూడా ఇవ్వలేదు’ అనగానే బిగ్ బీ నవ్వేశాడు. కాగా అమితాబ్ నవ్వుకు ఫిదా అయిన ప్రేక్షకులు.. బచ్చన్ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు.