వర్షంలో కత్రినా హాట్ నంబర్.. తట్టుకోలేమంటున్న ఫ్యాన్స్

by Shyam |   ( Updated:2023-10-10 17:06:19.0  )
వర్షంలో కత్రినా హాట్ నంబర్.. తట్టుకోలేమంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ కిలాడి అక్షయ్‌ కుమార్‌, రవీనా టాండన్‌ జంటగా నటించిన ‘మోహ్రా(1994)’ చిత్రంలోని ‘టిప్‌ టిప్‌ బర్‌సా పానీ’ సాంగ్‌ ఎవర్‌గ్రీన్‌‌గా నిలిచిపోయింది. ఈ హాట్ నంబర్‌లో ఎల్లో కలర్ సారీలో కనిపించిన రవీన.. వర్షంలో తడిసిన అందాలతో జనాలను మైమరపించింది. ఈ పాట ఇప్పటికి కూడా ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి గీతాన్ని ఇప్పుడు అక్షయ్‌, కత్రినాకైఫ్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సూర్యవంశీ’లో సంగీత దర్శకుడు తనిష్‌ బాగ్చి రీమిక్స్‌ చేశారు. ‘మోహ్రా’లో రవీనా హాట్‌నెస్‌కు ఏ మాత్రం తగ్గకుండా కత్రినా సైతం తన బోల్డ్‌నెస్‌తో యువతలో హీట్ పెంచేసింది. ఇక ఫరాఖాన్‌ కొరియోగ్రఫీ సమకూర్చిన ఈ వర్షం సాంగ్‌లో కత్రినా తడిసిన అందాలను చూసిన నెటిజన్లు పొగడ్తల్లో ముంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుండగా.. ‘సూర్యవంశీ’ మూవీ దీపావళి సందర్భంగా రిలీజైన విషయం తెలిసిందే.

ఇండియన్ సాంగ్‌కు స్టెప్పులేసిన సింగపూర్ ఫ్యాన్స్.. వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed