- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీ నిండ హోమో సెక్సువల్స్.. బయటపడటం లేదంతే!
దిశ, సినిమా: ‘టైటానిక్’ స్టార్ కేట్ విన్స్‌లెట్.. హాలీవుడ్ స్టార్స్ హోమో సెక్సువాలిటీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చాలా మంది నటులు తమ సెక్సువాలిటీపై ఓపెన్ అయ్యేందుకు భయపడుతున్నారని, అలాంటి స్టిగ్మా నుంచి బయటపడాలని సూచించింది. తనకు తెలిసిన నలుగురు నటులు కూడా ఈ విషయాన్ని పబ్లిక్ చేసేందుకు వెనుకాడుతున్నారని తెలిపింది. తమను జడ్జ్ చేస్తూ వివక్ష చూపిస్తారనే హోమోఫోబియాతో అలా చేస్తున్నారని, సరైన పాత్రలు రాక కెరియర్ నాశనం అవుతుందనే భయంతో ఉన్నారని చెప్పింది. సెక్సువాలిటీని హైడ్ చేస్తూ బతకడం నిజంగా బాధ కలిగించే విషయమన్న కేట్ విన్స్‌లెట్.. గే పాత్రలను గే యాక్టర్స్ మాత్రమే చేయాలన్న చెత్త సాంప్రదాయాన్ని హాలీవుడ్ వదులుకుంటే మంచిదని అభిప్రాయపడింది. యాక్టర్ స్వలింగ సంపర్కుడు అయితే అలాంటి పాత్రలే చేయాలన్న రూల్ ఏమీ లేదు కదా? అని ప్రశ్నించింది.
వెల్ నోన్ యంగ్‌స్టర్స్, అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన యాక్టర్స్‌లో స్వలింగ సంపర్కులు చాలా మంది ఉన్నారని, తనకు తెలిసిన వాళ్లు సైతం ఈ విషయంపై మాట్లాడేందుకు వెనుకాడుతున్నారని చెప్పింది. స్క్రీన్‌పై లెస్బియన్ క్యారెక్టర్ ప్లే చేయడం ద్వారా ఎల్‌జీబీటీక్యూ గురించి ప్రపంచం ముందు ప్రస్తావించే అవకాశం వచ్చిందని తెలిపిన కేట్ విన్స్‌లెట్.. సీనియర్ యాక్టర్స్ తమ హోమో సెక్సువాలిటీ గురించి ఓపెన్ అయితే పరిస్థితుల్లో మార్పు రావొచ్చని, ఇప్పుడే హాలీవుడ్‌కు ఎంటర్ అయ్యే వారికి కొంచెం సపోర్ట్‌గా ఉంటుందని అభిప్రాయపడింది.