ప్రళయం తర్వాత కాశీ ఒక్కటే భూమ్మీద ఉంటుందా??

by Hamsa |
ప్రళయం తర్వాత కాశీ ఒక్కటే భూమ్మీద ఉంటుందా??
X

దిశ, వెబ్ డెస్క్: ప్రళయం సంభవిస్తే భూమిపైన ఏదీ మిగలదు అని చెబుతారు. భూమి మీద సమస్థ జీవరాశి అంతమవుతుందని అంటారు. కాని ఒక ప్రదేశం మాత్రం ప్రళయాన్ని సైతం తట్టుకుని మనుగడ సాగిస్తుందని హిందూ పండితులు పేర్కొంటున్నారు. ఆ ప్రాంతమే సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు కొలువైన కాశీ నగరం.

స్వయంగా ఆ మహాశివుడే వారణాసిని ప్రతిష్ఠించాడని, అంతటి పవిత్రమైన ప్రదేశం భారతదేశంలోనే ఉండటం ఎంతో గొప్ప విషయమని వేద పండితులు అంటారు. బ్రహ్మదేవుడు సృష్టించిన సకల చరాచర జీవజాతి కల్పాంతం తర్వాత ఏర్పడే ప్రళయంతో నాశనమవుతుందట.

లయకారుడైన మహాదేవుడు వారణాసిని సృష్టించాడు. కాబట్టే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెట్టి దాన్ని కాపాడతాడని పండితుల నమ్మకం. ఆ పరమేశ్వరునితో ఈ నగరం నిర్మితమైంది కాబట్టి ఎలాంటి ప్రళయాలు సంభవించినా దాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed