తైమూర్‌కు కుండల తయారీ నేర్పిన బెబో

by Shyam |   ( Updated:2023-08-11 06:42:23.0  )
తైమూర్‌కు కుండల తయారీ నేర్పిన బెబో
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ బెస్ట్ మదర్ అనిపించుకుంటోంది. తైమూర్ ఖాన్‌ను బెస్ట్ వాల్యూస్‌తో పెంచడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. తనతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసేందుకు ఇష్టపడే కరీనా.. లాక్‌డౌన్‌లో తనకు గార్డెనింగ్ నేర్పించింది. సైఫ్ అలీ ఖాన్ విలేజ్‌కు వెళ్లి, విలేజ్ కల్చర్‌ను కూడా తైమూర్‌కు పరిచయం చేయించిన బెబో.. ప్రస్తుతం ధర్మశాలలో భర్త, కొడుకుతో కలిసి వెకేషన్ మూడ్‌లో ఉంది.

ఈ క్రమంలోనే ధరమ్‌కోట్ స్టూడియోలో కుండలు ఎలా తయారు చేస్తారో కొడుకుకు చూపించింది. తనను పక్కనే కూర్చో పెట్టుకుని మరీ కుండల తయారీని ప్రాక్టికల్‌గా చేసి చూపించడంతో తైమూర్ ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యాడు. చాలా ఉత్సాహంగా తల్లిని అనుకరించే ప్రయత్నం చేశాడు. కరీనా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కాగా తైమూర్ లాక్‌డౌన్‌ టైమ్‌లో పెయింటింగ్‌తో పాటు స్పానిష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు.విషయంలో బెస్ట్ అనిపించుకుంటున్న కరీనా త్వరలో మరో బేబీకి వెల్‌కమ్ చెప్పబోతుంది. 2021 మార్చిలో రెండో బిడ్డకి జన్మనివ్వబోతుంది. కాగా ఈ మధ్యే ‘లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్ కంప్లీట్ చేసిన బెబో.. కరణ్ జోహార్ పీరియాడికల్ డ్రామా ‘తక్త్’లో నటించనుంది.

Advertisement

Next Story