- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చేంజ్ వితిన్’.. కరణ్ ఎపిక్ సిరీస్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఎపిక్ సిరీస్ అనౌన్స్ చేశారు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ‘చేంజ్ వితిన్’ పేరుతో సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఫిల్మ్ క్రియేటివ్ ఫ్రెటర్నిటీ రాజ్ కుమార్ సంతోషి, దినేశ్ విజన్, మహవీర్ జైన్ ఈ సిరీస్ కోసం పనిచేయనుండగా.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి స్ఫూర్తి పొందుతూ భారత స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి సంబంధించిన ఇంక్రెడిబుల్ స్టోరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
మనం ఎవరు? మన సంస్కృతి ఏంటి? మన సంప్రదాయక పద్ధతులు ఏంటి? అనే విషయాలను భారత్‌లోని నలుమూలలకు చాటిచెప్పేలా ఈ శక్తిమంతమైన కథ ఉండబోతుందన్నారు కరణ్. గతేడాది మహాత్మాగాంధీ 150వ జన్మదినం సందర్భంగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఒక ప్రత్యేక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని.. ఇప్పుడు స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని జరుపుకునేందుకు కలిసి వస్తున్నామని తెలిపారు. ‘చేంజ్ వితిన్’.. భారత ఆత్మ గురించి వివరించే ఫ్రెష్ బిగినింగ్‌కు విట్‌నెస్‌గా ఉంటుందన్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ గురించి వివరించనున్నట్లు తెలిపారు కరణ్.
Happy to announce our first Epic series of #ChangeWithin initiatives to celebrate 75 years of Independence. Friends from the creative fraternity Rajkumar Santoshi, Dinesh Vijan & Mahaveer Jain come together to tell incredible stories of our FREEDOM @narendramodi ji 🇮🇳 pic.twitter.com/TYK5Hd8BoQ
— Karan Johar (@karanjohar) December 22, 2020